- కొంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్‌లో ఆండ్రాయిడ్ ఆధారిత చిమ్నీలు, ప్లగ్ ఎన్ ప్లే చిమ్నీ, హాబ్టాప్స్, కుక్‌టాప్స్ వంటి ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందవచ్చు.
హైదరాబాద్, మార్చి 31, 2026: భారతదేశంలోని ప్రముఖ స్మార్ట్ కిచెన్ టెక్నాలజీ బ్రాండ్ ‘బియాండ్ అప్లయన్సెస్’ హైదరాబాద్‌లో తొలి ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. ఒమ్నిచానల్ విస్తరణలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. ఇప్పటికే ఆన్లైన్ విక్రయాల్లో బలమైన స్థానం సంపాదించిన ఈ సంస్థకు, ఈ ప్రాంతం నుంచి నిరంతర డిమాండ్ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-కామర్స్ ఆదాయంలో హైదరాబాద్ ఎప్పటికప్పుడు టాప్-3 మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది.
కొంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను నిజమైన కిచెన్ వాతావరణంలో తీర్చిదిద్దారు. కస్టమర్లు ఆండ్రాయిడ్ ఆధారిత చిమ్నీలు, ప్లగ్ ఎన్ ప్లే చిమ్నీ, హాబ్టాప్స్, కుక్‌టాప్స్ వంటి ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి అనుభూతి పొందేల రూపొందించారు. రియల్‌టైమ్ పనితీరు, సులభ వినియోగాన్ని ప్రదర్శిస్తూ ఆన్లైన్లో చూసే అనుభవం మరియు ప్రత్యక్ష అనుభవం మధ్య గ్యాప్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్టోర్‌ను రూపొందించారు. ముఖ్యంగా ప్లగ్ ఎన్ ప్లే చిమ్నీ, స్మార్ట్ టైమర్ హాబ్లకు హైదరాబాద్ మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా బియాండ్ అప్లయన్సెస్, వ్యవస్థాపకుడు, సీఈఓ ఈశ్వర్ కె వికాస్ మాట్లాడుతూ, “హైదరాబాద్ మాకు అత్యంత కీలక మార్కెట్. ఇక్కడి వినియోగదారులు కొనుగోలు ముందు ఉత్పత్తులను ప్రత్యక్షంగా అనుభవించాలని కోరుతున్నారు. ఆ అవసరాన్ని తీర్చడానికే ఈ ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించాం. దీని ద్వారా విక్రయాలు పెరగడమే కాకుండా వినియోగదారుల నమ్మకం కూడా మరింత బలపడుతుంది. వచ్చే 6 నుంచి 12 నెలల్లో ఈ ప్రాంతంలో మా అమ్మకాలను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ స్టోర్‌తో ‘బియాండ్ అప్లయన్సెస్’ ఆఫ్‌లైన్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2026 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు బెంగళూరు, ముంబై, న్యూ ఢిల్లీతో పాటు మొత్తం ఐదు నగరాల్లో విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆధునిక కిచెన్ టెక్నాలజీ ఎలా ఉండాలి, ఎలా అనిపించాలి అన్నదాన్ని వినియోగదారులకు ప్రత్యక్షంగా చూపిస్తూ, భారతీయ ఇళ్లలో స్మార్ట్ కిచెన్లను సాధారణం చేయడమే సంస్థ లక్ష్యంగా ఉంది.

